బిడ్డ తెల్లగా పుట్టాలని సున్నం తింటున్నారు..!

బిడ్డ తెల్లగా పుట్టాలని సున్నం తింటున్నారు..!

రంగుల లోకంలో నలుపు పట్ల ఉన్న వివక్ష అంతా ఇంతా కాదు. నల్లగా ఉండటం ఏదో నేరం అన్నట్లు అడ్వర్టైజింగ్‌ కంపెనీలు కూడా యాడ్లు రూపొందిస్తుంటాయి. అయితే మనిషి రంగు గురించి తాపత్రయం… బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది. పుట్టబోయే బిడ్డ మంచి రంగుతో పుట్టాలని ఖరీదైన ఆహారాన్ని తల్లులు తీసుకుంటారు. ఒకవేళ తెల్లగా పుట్టకపోతే ఆత్మన్యూనతకు గురవుతుంటారు. అయితే బిడ్డ అందంగా పుట్టాలని సున్నపు రాళ్లను తినే మహిళలు ఉన్నారనే విషయం మీకు తెలుసా?

హైదరాబాద్‌ లోని పాతబస్తీ ప్రాంతం. ఇక్కడ‘ఖడి’ పేరుతో దొరికే సున్నపు రాయికి ఫుల్‌ గిరాకీ ఉంటుంది. ఖడీని తింటే బిడ్డ అందంగా పుడుతుందట!. క్యాల్షియం అధిక మోతాదులో ఉండటమే అందుకు కారణమంటున్నారు వాళ్లు. అంతేకాదు సున్నపు రాయితో జీర్ణకోశసమస్యలు, మలబద్ధకం, మైకం తదితర సమస్యలు దూరం అవుతాయని నమ్ముతున్నారు.వంద ఏళ్లకు పైగా చరిత్ర ఈ ఆహారపు అలవాటును తరతరాలుగా ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నారు.

దిగుమతి చేసుకుంటరు

కుతుబ్‌ షాహీల కాలంలోనే బేగంబజార్‌ లోఖడీ దుకాణాలు వెలిశాయి. క్రమంగా పురానా హవేలీ, మొజంజాహీ మార్కెట్‌ప్రాంతాలకు ఈ దుకాణాలు విస్తరించాయి. ఇప్పటికీ కొన్ని కిరాణా దుకాణాలు ఖడీకి అడ్డాగా ఉన్నాయి. స్థా నిక వ్యాపారులతో పాటు,రాజస్థానీ వర్తకులు బీదర్‌ (కర్ణాటక) నుంచి సున్నపు రాయిని దిగుమతి చేసుకుంటారు. మార్వాడీ, జైన్‌, హిందూ, ముస్లిం .. ఇలా మతాలతో సంబంధం లేకుండా ఖడీని తీసుకుంటారని నరేందర్‌ అనే వ్యాపారి చెబుతున్నాడు. ‘కెన్యా దేశంలో కూడా ఇలాంటి ఆహారపు అలవాటు ఉంది. అక్కడి మహిళలు బిడ్డ ఆరోగ్యంగా పుట్టా లని సున్నపు రాయి,మట్టిని తింటారు. నైరోబీ నగరంలో ‘ఓడోవా’పేరుతో సున్నపు రాయి విరివిగా దొరుకుతుంది’అని చెప్పా డతను. మన దగ్గర తల్లులతో పాటు..వాళ్ల ఇళ్లలోని ఆడపిల్లలు చిన్నప్పటి నుంచే ఖడీని తినడం అలవాటు చేసుకుంటున్నారని నరేందర్‌ చెబుతున్నాడు.

డెడ్‌ చీప్‌

పాలిపోయిన పసుపు, పెద్ద ముక్కల నుంచి పల్లీ సైజులో పీస్‌ లను న్యూస్‌ పేపర్‌ లో ప్యాక్‌ చేసి అమ్ముతారు. ఇరవై గ్రాముల కోన్‌ (పీస్‌ ) ధర రెండు రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. రోజుకి సగటున ఒక మహిళ 20 నుంచి 30 రూపాయల దాకా ఖడీ కొంటారట. నేరుగా తినని వాళ్లు. దానిమ్మ జ్యూస్‌ లో గోధుమ గింజ సైజులో సున్నపు రాయిని కలిపి తింటారట. ఇలాచేస్తే నార్మల్‌ డెలివరీ అవుతుందని, పుట్టే బిడ్డ తెలివి తేటలతో పుడతారని వాళ్ల నమ్మకం.

న్యూట్రిషియన్లు ఏమంటున్నరు

పోషక విలువల కోసం రాళ్లు, మట్టి తినడం పూర్వకాలంలో ఉండేది. బిడ్డ అందంగా..ఆరోగ్యంగా పుట్టా లని ప్రతీ తల్లి కోరుకుంటుంది.అయితే మారిన జీవనశైలికి అనుగుణంగా ఈ అలవాటు ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ వీణా శత్రుఘ్న. ‘‘టీ, కాఫీలు తాగితే పిల్లలు నల్లగా పుడతారని కొందరు అనుకుంటారు. ఇటువంటి అపోహల వల్ల ఒక్కోసారి పోషకాహారానికి కూడా దూరం అవుతున్నారు. క్యాల్షియం…తినే తిండిలో దొరుకుతుందన్న విషయం వాళ్లకు తెలియంది కాదు. కానీ, ఖడి తినడమే సరైందని వాళ్లు బలంగా నమ్ముతున్నారు’’ అనివివరించారు వీణ.

ప్రతికూల ప్రభావం!!

తక్కువ ధరకు దొరుకుతుండటంతో సున్నపు రాయిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.అయితే ఈ అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. మహిళల్లోఎనీమియా, ఎముకలు పెళుసుగా మారడం,అజీర్తి సమస్యలు వస్తున్నాయి. ఖడీని రెగ్యులర్‌ గా తీసుకునేవాళ్లు కడుపు నొప్పితో తరచూ పురానాపూల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరుతుంటారని అక్కడి సిబ్బంది చెబుతున్నారు.క్యాల్షియం లోపం ఉన్నవాళ్లు ఖడీలో అది దొరుకుతుందని ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ, అది ఎంత మాత్రం నిజం కాదన్నారు డాక్టర్‌ మహ్మద్‌ నజీర్‌ .

అరకొర గిరాకీ

చాక్‌ పీస్‌ ల రాకతో ఖడి అమ్మకాలపై  ప్రభావంపడింది. గతంలో ఖడీని బల్క్‌‌గా అమ్మేవాళ్లు.కానీ, ఇప్పుడు చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో దొరుకుతున్నాయి. ఖడి మార్కెట్‌ కుదేలు అయినప్పటికీ కొందరు కిరాణా షాపువాళ్లు ఇప్పటికీ దాన్ని అమ్ముతున్నారు. ఒకవేళ ఖడీ దొరక్కపోతే చాక్‌ పీస్‌ లు తింటున్నారు. పెయింటింగ్‌ లో ఉపయోగించే సున్నాన్ని కూడా తింటున్నారు.

ఆరాటం ఎక్కువే!

ఆడా–మగా.. లింగ బేధం లేకుండా అందం కోసం ఆరాటపడేవాళ్లు ఎక్కువ మంది.అందంగా కనపడేందుకు ఎంతదాకా అయినా వెళ్తా రు. ఇంతకీ ప్రపంచం మొత్తం మీదఅందం కోసం జరిగే వ్యాపారం విలువ ఎంతో తెలుసా? అక్షరాల 10 బిలియన్‌ డాలర్లు .2023 కల్లా కేవలం విమెన్‌ ఫెయిర్ స్‌ క్రీముల మార్కెట్‌ రెవెన్యూ ఐదు వేల కోట్లరూపాయలు దాటొచ్చనే అంచనా. ఇక భారతీయుల విషయానికొస్తే.. 2016లో ఫెయిర్ నెస్‌ ఉత్పత్తు ల కోసం 300 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.