ఆదిలాబాద్కు సివిల్ సర్వీసెస్ ట్రైనీ ఆఫీసర్లు

ఆదిలాబాద్కు సివిల్ సర్వీసెస్ ట్రైనీ ఆఫీసర్లు

ఆదిలాబాద్​టౌన్/నేరడిగొండ, వెలుగు: ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఈఎస్, ఐఎస్ఎస్​కు ఎంపికైన 16 మంది ట్రైనింగ్​లో భాగంగా శనివారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్​ రాజర్షి షా వారికి స్వాగతం పలికారు. కలెక్టరేట్ లో ట్రైనీ ఆఫీసర్లతో సమావేశమై మాట్లాడారు. వీరు మూడు బృందాలుగా ఏర్పడి, నేరడిగొండ మండలంలోని కుమారి, తాంసి మండలంలోని బండల నాగపూర్ లో, తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామాల్లో పర్యటించన్నారని తెలిపారు. 

ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో సైతం క్షేత్ర పరిశీలన చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై అధ్యయనం చేస్తారని చెప్పారు.  జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వారికి వివరించారు. డీఎఫ్​వో ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు)​ రాజేశ్వర్, ఏఎస్పీ కాజల్, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, ఎంసీఆర్​హెచ్ఆర్​డీ కోఆర్డినేటర్ స్వామి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

కుమారి గ్రామానికి ట్రైనీ ఆఫీసర్లు..

నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామాన్ని ఐదుగురు సివిల్ సర్వీసెస్ ట్రైనీ ఆఫీసర్లు శనివారం సందర్శించారు. వారికి అధికారులు, నాయకులు స్వాగతం పలికి సత్కరించారు. గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలను ఎంపీడీవో శేఖర్ వివరించారు. ట్రైనీ ఆఫీసర్లు నాలుగు రోజులపాటు గ్రామంలోనే బస చేసి, ఇక్కడి ప్రజల జీవన స్థితిగతులపై అధ్యయనం చేస్తారని చెప్పారు.