- సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
కామారెడ్డి, వెలుగు: వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలో ఆయన పర్యటించారు. కామారెడ్డి మండలం గర్గుల్, రామారెడ్డి మండలం గోకుల్తండాలో వడ్ల కొనుగోలు సెంటర్లను పరిశీలించారు. రైతులు, అధికారులతో మాట్లాడారు. సెంటర్లలో సౌలతులు కల్పించాలని సూచించారు.
కాంటా అయిన తర్వాత రైతులకు వడ్ల డబ్బులు చెల్లించేందుకు, ఆన్లైన్లో ఎంట్రీ చేయాలన్నారు. కాంటా, ఆన్లైన్ ఎంట్రీలో జాప్యం జరగకుండా చూసుకోవాలని సూచించారు. జిల్లాలో కొనుగోళ్ల వివరాలను అధికారులతో చర్చించారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 35,300 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్, డీఎస్వో వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్ ఉన్నారు.

