సూడాన్‌‌లో చిక్కుకున్న పౌరుల తరలింపులో సవాళ్లు

సూడాన్‌‌లో చిక్కుకున్న  పౌరుల తరలింపులో సవాళ్లు

ఖార్తోమ్: తొమ్మిది రోజులుగా సూడాన్‌‌లో అంతర్యుద్ధం జరుగుతోంది. పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్), ఆర్మీకి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో 400 మందికి పైగా చనిపోయారు. వేల మంది గాయపడ్డారు. దీంతో ప్రపంచ దేశాలు తమ పౌరులు, దౌత్య సిబ్బందిని వీలైనంత త్వరగా యుద్ధభూమి నుంచి తరలిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామునే తమ ఎంబసీ అధికారులను అమెరికా మిలిటరీ ఎయిర్‌‌‌‌లిఫ్ట్ చేసింది. తమ ఎంబసీ ఉద్యోగులు, పౌరులు, మిత్ర దేశాలకు చెందిన పౌరులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫ్రాన్స్, గ్రీస్, ఇతర యూరోపియన్ దేశాలు ప్రకటించాయి. 

రోడ్డు మార్గం ద్వారా ఇండియన్ల తరలింపు

సూడాన్‌‌లో చిక్కుకున్న ఇండియన్లను రోడ్డు మార్గం ద్వారా తరలించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. హింస జరుగుతున్న ఏరియాకు బయట ఉన్న వారిని ముందు తరలించాలని, హింస తగ్గిన తర్వాత పోరాటం కొనసాగుతున్న ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఎవాక్యుయేట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సూడాన్ ఎయిర్‌‌‌‌స్పేస్​ను మూసేయడంతో ఈ కొత్త ప్లాన్‌‌పై కేంద్రం కసరత్తు చేస్తోంది.