ఓటు వేయడం మర్చిపోకండి: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్

ఓటు వేయడం మర్చిపోకండి: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్

లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత పౌరులను కోరారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుని ప్రధాన విధుల్లో ఒకటని అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మై ఓట్ మైవాయిస్ మిషన్ కోసం ఓ వీడియో ద్వారా జస్టిస్ చంద్రచూడ్ ఈ మేసేజ్ అందించారు.

రాజ్యాంగం మనకు అనేక హక్కులను కల్పిస్తుంది. అయితే మనలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను కూడా నిర్వర్తించాలని ఆశిస్తుందన్నారు.   రాజ్యాంగబద్దమైన ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం పౌరసత్వం ప్రధాన విధుల్లో ఒకటని ’’ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు.

భారత దేశ పౌరులుగా బాధ్యతా యుతంగా ఓటే వేసే అవకాశాన్ని వదులుకోవద్దన్నారు. ప్రతి ఒక్కరం సగర్వంగా ఓటు వేద్దాం..  నా ఓటు నా వాయిల్ అని సీజేఐ అన్నారు.