
సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ మరింత ఈజీగా సాగేందుకు వీలుగా కొత్తగా నాలుగు స్పెషల్ బెంచ్ లను ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటించారు.
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటన
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ మరింత ఈజీగా నడిచేందుకు వీలుగా కొత్తగా 4 స్పెషల్ బెంచ్ లను ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటించారు. క్రిమినల్ కేసులు, డైరెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్స్ వివాదాలు, భూసేకరణ, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అంశాలపై ఈ బెంచ్ లు వచ్చే వారం నుంచి విచారణ చేపడతాయని తెలిపారు. కోర్టులో ఫైల్ అయ్యే కేసుల లిస్టింగ్ పై ఫోకస్ పెట్టడానికి తాను ప్రయారిటీ సీజేఐగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన వెల్లడించారు. కేసులను ఆటోమేటిక్ గా లిస్టింగ్ చేసేలా రిజిస్ట్రార్కు ఆదేశాలు కూడా ఇస్తున్నట్లు చెప్పారు. అర్జంట్ ఉంటే షెడ్యూల్ కు ముందు లిస్ట్ చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు.