రాజన్న దర్శనాల బంద్‌‌ పై స్పష్టత ఇవ్వాలి ..బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ

రాజన్న దర్శనాల బంద్‌‌ పై స్పష్టత ఇవ్వాలి  ..బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాల బంద్​పై వివిధ ప్రచారాలు నడుస్తున్నాయని, వీటిపై భక్తులకు అధికారులు స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నేత ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్​లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయం అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్నారు. రాజన్న ఆలయంలో దసరా తర్వాత భక్తులకు దర్శనాలను నిలిపివేస్తారని ప్రచారం జరుగుతుందని, దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలన్నారు. సమావేశంలో నాయకులు రేగుల మల్లికార్జున్​, పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, కృష్ణస్వామి, గుంటి కనుకయ్య, తదితరులు పాల్గొన్నారు. ​