కవిత పర్యటనలో తన్నుకున్న బీఆర్ఎస్​ లీడర్లు

కవిత పర్యటనలో తన్నుకున్న బీఆర్ఎస్​ లీడర్లు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్​ లీడర్లు పార్టీ జిల్లా ఆఫీసులో తన్నుకున్నరు. బుధవారం పెద్దపల్లి పర్యటనలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌ అనంతరం కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దాసరి మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్గం కార్యకర్తలు కవితతో ఫొటో దిగడానికి పోటీ పడ్డారు. 

ఈక్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇంత జరుగుతున్నా రెండు ప్రాంతాలకు చెందిన ఏ ప్రధాన నాయకుడు వారిని వారించే ప్రయత్నం చేయలేదు.