జెండా పండుగలో లొల్లి.. అసలేమైందంటే..!

జెండా పండుగలో లొల్లి.. అసలేమైందంటే..!
  • .మల్కాజ్‌‌‌‌గిరిలో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య గొడవ
  • కార్పొరేటర్ శ్రవణ్​పై టీఆర్ఎస్ లీడర్ల దాడి
  • బట్టలు చింపి.. బీర్ బాటిల్, రాడ్లతో అటాక్
  •  మల్కాజ్‌‌‌‌గిరి చౌరస్తాలో కాలితో తన్నేందుకు ఎమ్మెల్యే మైనంపల్లి యత్నం
  •  శ్రవణ్‌‌‌‌ను పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్
  • బండి సంజయ్​పై మైనంపల్లి బూతుపురాణం

మల్కాజ్‌‌‌‌గిరి, వెలుగు: జెండా పండుగ రోజే టీఆర్ఎస్, బీజేపీ లీడర్లు కొట్టుకున్నారు. మల్కాజ్‌‌‌‌గిరి జీహెచ్ఎంసీ ఆఫీసులో జరిగిన గొడవలో బీజేపీ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ శ్రవణ్‌‌‌‌కు గాయాలయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు శ్రవణ్​పై దాడి చేశారని, బట్టలు చిరిగేలా కొట్టారని, బీర్ బాటిల్​తో, రాడ్లతో అటాక్ చేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. దాడి చేయించిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అరెస్ట్ చేయాలంటూ పోలీస్‌‌‌‌స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. గొడవపై రెండు పార్టీల నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.

అసలేమైందంటే..
మల్కాజ్‌‌‌‌గిరి జీహెచ్ఎంసీ ఆఫీసులో పంద్రాగస్ట్​వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును.. ‘ఎమ్మెల్యే గారు నమస్తే’ అంటూ కార్పొరేటర్ శ్రవణ్ పలుకరించారు. గతంలో శ్రవణ్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని సీరియస్‌‌‌‌గా స్పందించిన మైనంపల్లి.. ‘ఇక్కడ ఎవరు అభివృద్ధి చేస్తున్నార్రా?’ అని ప్రశ్నించారు. ‘నేను మీతో మంచిగా మాట్లాడుతున్నా. మీరు అలా అరేయ్ అని ఎందుకు అంటున్నారు?’ అని శ్రవణ్ నిలదీశారు. దాంతో టీఆర్ఎస్ నాయకులు.. శ్రవణ్, బీజేపీ నాయకులను అక్కడి నుంచి పంపేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. తనను బట్టలు చిరిగేలా కొట్టి, బీర్ బాటిల్, రాడ్లతో దాడి చేశారంటూ మల్కాజ్‌‌‌‌గిరి చౌరస్తా దగ్గర బీజేపీ కార్యకర్తలతో కలిసి శ్రవణ్ నిరసనకు దిగారు. అక్కడికీ వచ్చిన మైనంపల్లి.. శ్రవణ్‌‌‌‌ను కాలితో తన్నడానికి ప్రయత్నించగా నాయకులు అడ్డుకున్నారు. శ్రవణ్ అక్కడి నుంచి కాలినడకన వెళ్లి మల్కాజ్‌‌‌‌గిరి గవర్నమెంట్​ హాస్పిటల్‌‌‌‌లో చికిత్స పొందారు. బీజేపీ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న నాయకులు భారీగా అక్కడికి చేరుకుని ఆందోళనలు చేశారు. తర్వాత బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్​ రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, విజయ శాంతి తదితరులు శ్రవణ్‌‌‌‌ను పరామర్శించారు.
ఫాల్తుగాడనే మైనంపల్లిని చేర్చుకోలే: బండి సంజయ్
ప్రజల కోసం, అభివృద్ధి కోసం పాటుపడే బీజేపీ నాయకుడిపై టీఆర్ఎస్ నాయకులు, గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బండి సంజయ్ అన్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది గూండాయిజం చేయడానికా అని ప్రశ్నించారు. ‘‘బీజేపీలో చేరుతానంటూ మైనంపల్లి తిరిగిండు. ఫాల్తుగాడనే చేర్చుకోలేదు. బీజేపీలో చేరడానికి వచ్చినప్పుడు కేసీఆర్​ని, కేటీఆర్​ని, కవితను పొట్టు పొట్టు తిట్టిండు. ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాడని, కబ్జాలు చేస్తున్నాడని పార్టీలో చేర్చుకోలేదు. పైసలతో రాజకీయాలు నువు చేస్తావు.. మేం జెండాలు పట్టుకుని రాజకీయం చేస్తాం” అని చెప్పారు. పోలీసు అధికారుల ముందే బీజేపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు మహిళలని చంపే ప్రయత్నం చేస్తుంటే పోలీసు వ్యవస్థ ఎందుకుందని ప్రశ్నించారు. చంపుకునుడే, తన్నుకునుడే పోలీసుల పాలసీ అయితే తామూ మొదలు పెడతామని సంజయ్ హెచ్చరించారు. దాడులు జరుగుతుండగా చోద్యం చూస్తున్న పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. 8 మందిపై దాడి చేసి, మహిళలను కించపరిచిన వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

మల్కాజ్‌‌గిరి జీహెచ్ఎంసీ ఆఫీసులో పంద్రాగస్ట్​వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును.. ‘ఎమ్మెల్యే గారు నమస్తే’ అంటూ కార్పొరేటర్ శ్రవణ్ పలుకరించారు. గతంలో శ్రవణ్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని సీరియస్‌‌గా స్పందించిన మైనంపల్లి.. ‘ఇక్కడ ఎవరు అభివృద్ధి చేస్తున్నార్రా?’ అని ప్రశ్నించారు. ‘నేను మీతో మంచిగా మాట్లాడుతున్నా. మీరు అలా అరేయ్ అని ఎందుకు అంటున్నారు?’ అని శ్రవణ్ నిలదీశారు. దాంతో టీఆర్ఎస్ నాయకులు.. శ్రవణ్, బీజేపీ నాయకులను అక్కడి నుంచి పంపేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. తనను బట్టలు చిరిగేలా కొట్టి, బీర్ బాటిల్, రాడ్లతో దాడి చేశారంటూ మల్కాజ్‌‌గిరి చౌరస్తా దగ్గర బీజేపీ కార్యకర్తలతో కలిసి శ్రవణ్ నిరసనకు దిగారు. అక్కడికీ వచ్చిన మైనంపల్లి.. శ్రవణ్‌‌ను కాలితో తన్నడానికి ప్రయత్నించగా నాయకులు అడ్డుకున్నారు. శ్రవణ్ అక్కడి నుంచి కాలినడకన వెళ్లి మల్కాజ్‌‌గిరి గవర్నమెంట్​ హాస్పిటల్‌‌లో చికిత్స పొందారు. బీజేపీ కార్పొరేటర్‌‌‌‌పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న నాయకులు భారీగా అక్కడికి చేరుకుని ఆందోళనలు చేశారు. తర్వాత బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్​ రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, విజయ శాంతి తదితరులు శ్రవణ్‌‌ను పరామర్శించారు.
గూండాయిజం చేయడానికేనా ఎన్నుకున్నది?: బండి సంజయ్
ప్రజల కోసం, అభివృద్ధి కోసం పాటుపడే బీజేపీ నాయకుడిపై టీఆర్ఎస్ నాయకులు, గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బండి సంజయ్ అన్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది గూండాయిజం చేయడానికా అని ప్రశ్నించారు. ‘‘బీజేపీలో చేరుతానంటూ మైనంపల్లి తిరిగిండు. బీజేపీలో చేరడానికి వచ్చినప్పుడు కేసీఆర్​ని, కేటీఆర్​ని, కవితను పొట్టు పొట్టు తిట్టిండు. ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాడని, కబ్జాలు చేస్తున్నాడని పార్టీలో చేర్చుకోలేదు. పైసలతో రాజకీయాలు నువు చేస్తావు.. మేం జెండాలు పట్టుకుని రాజకీయం చేస్తాం” అని చెప్పారు. పోలీసు అధికారుల ముందే బీజేపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు మహిళలని చంపే ప్రయత్నం చేస్తుంటే పోలీసు వ్యవస్థ ఎందుకుందని ప్రశ్నించారు. చంపుకునుడే, తన్నుకునుడే పోలీసుల పాలసీ అయితే తామూ మొదలు పెడతామని సంజయ్ హెచ్చరించారు. దాడులు జరుగుతుండగా చోద్యం చూస్తున్న పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. 8 మందిపై దాడి చేసి, మహిళలను కించపరిచిన వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.