మిర్యాలగూడలో రచ్చకెక్కిన అధికార పార్టీ వర్గపోరు

మిర్యాలగూడలో రచ్చకెక్కిన అధికార పార్టీ వర్గపోరు

మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఉమ్మడి బాపూజినగర్​లో అధికార పార్టీ నేతల మద్య ఉన్న వర్గపోరు రచ్చకెక్కింది. ఆదివారం రాత్రి మున్సిపల్​ వైస్​ ఛైర్మన్​ తన అనుచురులతో కలిసి ఇదే వార్డు అధికార పార్టీకి చెందిన  మాజీ కౌన్సిలర్ అంజంరాజు ఇంటిపైకి వెళ్లి దూషించటంతో పాటు దాడికి పాల్పడిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం ..ఉమ్మడి బాపూజినగర్​(21,7వ వార్డు)లో ఆదివారం ముత్యాలమ్మ తల్లి మూడవ వార్షికోత్సవ వేడులను జరుపుకున్నారు. ఈ క్రమంలో వైస్​ ఛైర్మన్​తో పాటు పలువురు పూజలకు హాజరయ్యారు. టెంపుల్​ వద్దకు వచ్చిన పాతూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వైస్​ ఛైర్మన్​, అనుచరులను దూషించాడని ఆరోపిస్తూ పలువురు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ క్రమంలో వెంకటేశ్వరరావు తలపగిలింది. రాత్రి 10 గంటలకు జరిగిన ఈ ఘర్షణకు మద్ధతుగా పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 100 నుంచి 150 మంది బాపూజినగర్​కు చేరుకోవటంతో ఉద్రిక్తత పరిస్ధితికి దారితీసినట్లు స్థానికులు తెలిపారు. అదే విధంగా మాజీ కౌన్సిలర్​, 7వ ఇంచార్జ్​గా ఉన్న అంజంరాజు ఇంటికి వద్ధకు  వైస్​ ఛైర్మన్​, వారి అనుచరులతో చేరుకుని దాడికి దిగారన్నారు. ప్రత్యర్ధుల దాడిలో తలపగలగొట్టుకున్న వెంకటేశ్వరరావుతో పాటు మాజీ కౌన్సిలర్ వన్​టౌన్​ పీఎస్​లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు పెద్ధలు రంగంలోకి దిగినట్లు సమాచారం. మాజీ కౌన్సిలర్​పై దాడికి ఇటీవల వార్డులో జరిగిన దసరాతో పాటు పట్టణ  కీలకప్రజాప్రతినిధి బర్త్ డే వేడుకల అనంతరం వార్డులో చోటు చేసుకున్న పరిణామాలే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మరిన్ని వార్తల కోసం

సౌండ్ చేశారో.. సైలెన్సర్ నలిగిపోద్ది..

యూపీ ఎన్నికల్లో 40 శాతం సీట్లు మహిళలకే