స్వచ్ఛ భారత్ అనేది మనందరీ బాధ్యత : నరేంద్ర మోదీ

 స్వచ్ఛ భారత్ అనేది మనందరీ బాధ్యత  :   నరేంద్ర మోదీ

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పరిశుభ్రత  కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.  ప్రతి ఒక్క భారతీయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మోదీ కోరారు.  అక్టోబర్ 1 ఉదయం 10 గంటలకు మనమందరం ఈ కీలకమైన  పరిశుభ్రత కార్యక్రమంలో  పాల్గొదాం.  స్వచ్ఛ భారత్ అనేది మనందరీ బాధ్యత. 

ALSO READ  : భారత్‌తో సన్నిహిత సంబంధాలకు కట్టుబడి ఉన్నాం : జస్టిన్ ట్రూడో

 పరిశుభ్రమైన దేశాన్ని నిర్మించే ఈ గొప్ప ప్రయత్నంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవండి.. జాతిపిత తన జీవితాంతం పారిశుద్ధ్యానికి అపారమైన ప్రాధాన్యతనిచ్చారంటూ  అంటూ మోదీ ట్వీట్ చేశారు.   

అంతకుముందు మన్ కీ బాత్ 105వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, అక్టోబర్ 1న ఆదివారం ఉదయం 10 గంటలకు పరిశుభ్రతపై పెద్ద కార్యక్రమం నిర్వహించబోతున్నామని మోదీ తెలిపారు. స్వచ్ఛ భారత్ 2014 అక్టోబర్ 2న ప్రారంభించబడింది, 2014 సెప్టెంబరు 24న కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్ఛ భారత్ కు ఆమోదం తెలిపింది. గ్రామాల్లో, కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది.