ఢిల్లీ సీఎం పేరుతో AK మొబైల్ యాప్‌

ఢిల్లీ సీఎం పేరుతో AK మొబైల్ యాప్‌

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ‘AK యాప్‌’ పేరుతో మొబైల్‌ యాప్‌ను ఇవాళ (బుధవారం) ఢిల్లీలో విడుదల చేశారు. స్థానిక ప్రజలు, ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకు వీలుగా ఈ యాప్‌ను లాంచ్ చేశారు. పార్టీపై, ఆప్‌ నేతలపై తప్పుడు ప్రచారం జరిగితే నిజానిజాలను ప్రజలకు తెలియజేసేలా ఈ యాప్ ను  అందుబాటులోకి తీసుకోచ్చామని కేజ్రీవాల్ ట్విట్టర్‌లో తెలిపారు. ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో అందుబాటులో ఉండే  యాప్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రారంభం, విజయాలు, పార్టీకి సంబంధించిన అనేక అంశాలను చేర్చారు.

దీంతో పాటు ఢిల్లీ సీఎం పర్యటనలు, ప్రజా సంబంధ కార్యక్రమాలు, లైవ్‌ టీవీ వంటి వివరాలు AK మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటాయని ట్విట్టర్ లో పోస్ట్‌  చేశారు కేజ్రీవాల్‌. అంతేకాదు ఈ యాప్‌ ప్రత్యేకతలను వివరిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారిక ట్విట్టర్ లో పూర్తి వివరాలను పోస్ట్‌ చేశారు.