ఢిల్లీ అల్లర్లు కంట్రోల్ చేయాలంటూ కేంద్రాన్ని కోరిన కేజ్రీవాల్

ఢిల్లీ అల్లర్లు కంట్రోల్ చేయాలంటూ కేంద్రాన్ని కోరిన కేజ్రీవాల్

ఢిల్లీలో  పరిస్థితి  ఆందోళనకరంగా  ఉందన్నారు  సీఎం కేజ్రీవాల్. హింసాకాండను  పోలీసులు  కంట్రోల్  చేయలేకపోతున్నారని  ఆయన ట్వీట్ చేశారు.  భద్రతపై   ప్రజల్లో భరోసా  కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు.  అల్లర్లు జరుగుతున్న  ప్రాంతాల్లో  ఆర్మీని రంగంలోకి  దించాలని  కేంద్రాన్ని కోరారు.  అల్లర్లు  విస్తరించకుండా మిగితా  ప్రాంతాల్లోనూ …కర్ఫ్యూ విధించాలన్నారు  సీఎం కేజ్రీవాల్.

ఈశాన్య  ఢిల్లీలో  హై టెన్షన్  కొనసాగుతోంది. అల్లర్లు , హింసాకాండ జరగకుండా భారీగా  పోలీసులను మోహరించారు. మౌజాపూర్, జఫ్రాబాద్,  చాంద్ బాగ్ లో రాపిడ్ యాక్షన్  ఫోర్స్  బలగాలు కవాతు నిర్వహించాయి.  స్పెషల్  పోలీస్ కమిషనర్  శ్రీవాస్తవ .. జఫ్రాబాద్ లో పర్యటించారు. అల్లర్లు  జరిగిన ప్రాంతాలను  ఆయన పరిశీలించారు. మౌజాపూర్,  జఫ్రాబాద్  ఏరియాలో పరిస్థితులు  దారుణంగా ఉన్నాయి. కొన్ని భవనాల  నుంచి  ఇంకా మంటలు వస్తుండటంతో పోలీసులు  ఆర్పి వేస్తున్నారు.  గోకుల్ పరి కాలనీ… రాళ్లు, తగలబడిన  బైకులతో నిండిపోయాయి.