
తిరుమలలో నూతన పీఏసీ-5 వసతి సముదాయాన్ని ప్రారంభించారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ, సీఎం చంద్రబాబు. గురువారం ( సెప్టెంబర్ 25 ) తిరుమల చేరుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ సీఎం చంద్రబాబుతో కలిసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 105 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వసతి సముదాయాన్ని నిర్మించింది టీటీడీ. ఈ వసతి సముదాయంల 2 వేల 500 లాకర్లు, పది లిఫ్టులతో ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో సహా మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. రూ. 24 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏఐ అనుసంధాన కమాండ్ కంట్రోల్ సెంటర్, అలాగే రూ. 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన లడ్డు ప్రసాదాల ముడిసరుకుల నాణ్యత యంత్రాలను వర్చువల్ గా ప్రారంభించారు.
ఇదిలా ఉండగా.. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ( సెప్టెంబర్ 24 ) ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ ( సెప్టెంబర్ 25 ) రెండో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనంపై దర్శనమిచ్చారు స్వామివారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం.. రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ నిర్వహించనున్నారు.
వాహన సేవల వివరాలు:
- సెప్టెంబర్23 : సాయంత్రం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
- సెప్టెంబర్24 : సాయంత్రం 05:43 నుంచి 6.15 వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం... రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
- సెప్టెంబర్ 25 : ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం.. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం.. రాత్రి 7 గంటలకు హంస వాహనం
- సెప్టెంబర్ 26 : ఉదయం 8 గంటలకు సింహ వాహనం... మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం
- సెప్టెంబర్27 : ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం..మధ్యాహ్నం 1 గంటకు స్నపనం.. రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం
- సెప్టెంబర్28 : ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం... సాయంత్రం 6:30 నుంచి రాత్రి గరుడ వాహనం
- సెప్టెంబర్29 : ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం.... సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం... రాత్రి 7 గంటలకు గజ వాహనం
- సెప్టెంబర్30 :ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం... రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం
- అక్టోబర్ 1 :ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం
- అక్టోబర్ 2: ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం... రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం.