హామీలు నెరవేర్చడంలో సీఎం ఫెయిల్ : పొంగులేటి

హామీలు నెరవేర్చడంలో సీఎం ఫెయిల్ : పొంగులేటి

ఈ 9 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో కోరం  క్యాంపు కార్యాలయాలన్ని ప్రారంభించిన పొంగులేటి... కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది బలిదానాలు తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పొంగులేటి చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయి కానీ అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. గారడి మాటలు చెప్పే ఈ ప్రభుత్వానికి కాలం  దగ్గర పడిందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

 వచ్చే ఎన్నికల్లో ఈ  ప్రభుత్వానికి  ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్న  పొంగులేటి ... ప్రజాభీష్టం మేరకు తన రాజకీయ ప్రస్థానం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన  ఏ ఒక్క హమీలను కేసీఆర్ నేరవేర్చలేదని ఆరోపించారు. డబల్ బెడ్ రూమ్.. దళిత బంధు స్కీమ్ అడ్రస్ లేకుండా పోయిందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే సమయం దగ్గర పడిందన్న ఆయన.. నాలుగు సంవత్సరాల నుండి పదవి ఉన్నా.. లేకున్నా.. ప్రజలతోనే ఉన్నానని చెప్పారు. ప్రజలే తనకు దేవుళ్ళని పొంగులేటి అన్నారు.