విశాఖే పరిపాలనా రాజధాని.. గ్లోబల్ సమ్మిట్‭లో జగన్ ప్రకటన

విశాఖే పరిపాలనా రాజధాని.. గ్లోబల్ సమ్మిట్‭లో జగన్ ప్రకటన


గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విశాఖే పరిపాలనా రాజధాని అని ఆయన మరోసారి ప్రకటించారు. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందన్నారు. తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానని .. అక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పారు. భారతదేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారిందని ఆయన తెలిపారు. ఏపీలో రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. తద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు. ఏపీ గ్రోత్ రేట్ 11.14 శాతంగా ఉందని చెప్పారు. 

గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టాలని సీఎం జగన్ చెప్పారు. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు వస్తుంటే.. అందులో 3 పారిశ్రామిక కారిడార్లు ఏపీలోనే ఉన్నాయని జగన్ తెలిపారు. రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాయాల ద్వారా 540 సేవలు అందిస్తున్నామన్నారు. ఏపీలో సులువైన పారిశ్రామిక విధానం అమలవుతోందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడేళ్లు నెంబర్ వన్ స్థానంలో నిలిచామని అందుకు ఎంతో గర్వంగా ఉందని జగన్ అన్నారు.