ఆడుదాం ఆంధ్రా.. ఆణిముత్యాలను వజ్రాలుగా మారుద్దాం : సీఎం జగన్

ఆడుదాం ఆంధ్రా.. ఆణిముత్యాలను వజ్రాలుగా మారుద్దాం : సీఎం జగన్

ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయి అన్నారు ఏపీ  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. డిసెంబర్ 26వ తేదీ మంగళవారం ఉదయం గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ మైదానంలో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను సీఎం జగన్  ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ రోజు నుంచి ఊరూరా ఈ క్రీడలు జరుగాయని...  ఇది అందరూ పాల్గొనే గొప్ప పండగ అని అన్నారు. మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతాయి.  మన జీవితంలో క్రీడలు అవసరమని.. క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చెప్పారు. గ్రామస్థాయిలో క్రీడలు ఎంతో అవసరమని..  అందుకే గ్రామస్థాయి నుంచి అడుగులు వేస్తున్నామన్నారు. ఇకనుంచి  ప్రతి ఏడాది క్రీడా సంబరాలు జరుగుతాయని తెలిపారు.  

 అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులను పరిచయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని.. గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతికి దేశానికి అందిస్తామని సీఎం జగన్  చెప్పారు. ఈ క్రీడలను ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ స్పోర్ట్స్ కిట్లను పరిశీలించారు. తర్వాత క్రికెట్ క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు సీఎం జగన్ బ్యాటింగ్ చేశారు. మంత్రి రోజా కూడా బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఏపీలో గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 47 రోజుల పాటు ఐదు దశల్లో ఈ మెగా క్రీడా పోటీలు జరగనున్నాయి.

అంతకుముదు, గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది సీఎం వైఎస్ జగన్ పర్యటనను నిరసిస్తూ యువజన, విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టారు. ఆడుదాం ఆంధ్రా సరే-.. ఆట స్థలాలు ఎక్కడ అంటూ నినాదాలు చేస్తూ విమర్శించారు . ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆటలేంటి అంటూ ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.