పాల్వంచ, వెలుగు : పాల్వంచ లోని శ్రీనివాస కాలనీ గుట్టపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో హోమ గుండాల ఏర్పాటుకు భక్తులు గురువారం స్వామివారిని దర్శించుకునేందుకు 1,600 మెట్లు ఎక్కే భక్తులు ఉడత సాయంగా 4 వేల ఇటుకలను గుట్టపైకి చేర్చారు.
ఈనెల 11న గుట్టపైన శ్రీ సుదర్శన నారసింహ మహాయాగము నిర్వహిస్తున్న నేపథ్యంలో 30 హోమ గుండాలకు సరిపడా ఇటుకలు మూసి భక్తిని చాటుకున్నారు నూతన సంవత్సరం మొదటి రోజు కావడంతో గురువారం స్వామివారిని 2 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.
