కృష్ణా నదిపై కరకట్టకు రేపు సీఎం జగన్ శంకుస్థాపన?

 కృష్ణా నదిపై కరకట్టకు రేపు సీఎం జగన్ శంకుస్థాపన?
  • రూ.150 కోట్లతో కొత్త కరకట్ట నిర్మాణం
  • ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ మేర విస్తరణ

అమరావతి: కృష్ణానది కరకట్ట పనులకు రేపు సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకూ 15.525 కి.మీ. మేర విస్తరణ చేపట్టనున్నట్లు ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. దీని కోసం ప్రభుత్వం రూ. 150 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. రేపు బుధవారం ఉదయం 10:25 గంటల ప్రాంతంలో సీఎం పనులకు శ్రీకారం చుడతారని అధికార వర్గాలకు సమాచారం అందింది.

ప్రకాశం బ్యారేజి వద్ద నున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు కుడివైపు కృష్ణా కరకట్ట రోడ్డును విస్తరించనున్నారు. అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు  పర్యవేక్షణలో  ఇద్దరూ  అడిషనల్ ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, సీఐలు, ఎస్.ఐలు, కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 300  మంది సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టుకు వెళ్లే వారికి, సెక్రటేరియట్ ఎంప్లాయిస్ కి రూట్ మ్యాప్ సపరేట్ గైడ్ లైన్స్  ఇచ్చామని పోలీసులు చెబుతున్నారు.