బీజేపోళ్లను తరిమి కొట్టకపోతే దేశం నాశనమవుతుంది

బీజేపోళ్లను తరిమి కొట్టకపోతే దేశం నాశనమవుతుంది

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు చదువు వస్తదో రాదోనన్నారు సీఎం కేసీఆర్. ఆయనకు బదులు వేరొకరితో మాట్లాడిస్తే బెటరన్నారు. బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు కేసీఆర్. అర్థం కాకున్నా బీజేపీ వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. తనకు బడ్జెట్ అర్థం కాలేదని కిషన్ రెడ్డి అన్నారని..34 వేల కోట్లు ఎరువులకు సబ్సిడీ తగ్గించింది అబద్ధమా కిషన్ రెడ్డి చెప్పాలన్నారు కేసీఆర్.. కిషన్ రెడ్డికే బడ్జెట్ అర్థం కాలేదన్నారు కేసీఆర్.

విద్యుత్ ను రూ.1.10  పైసలకు యూనిట్ ఇస్తున్నట్లు గజ్వేల్ లో  మిషన్ భగీరథ ప్రారంభ సభలో మోడీ చెప్పారన్నారు. అసలు దేశంలోనే   రూ.1. 10 పైసలకు యూనిట్ ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. కళ్ల ముందు ఇన్ని కనిపిస్తున్నా.. మోడీ అబద్ధాలు చెబుతున్నారన్నారన్నారు. కేంద్ర పవర్ పాలసీ వల్ల 40 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా..  విద్యుత్ ఉత్పత్తి కావడం లేదన్నారు. విద్యుత్ ను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారన్నారు. బీజేపీకి  డబ్బులిచ్చే సంస్థలకు విద్యుత్ ప్రాజెక్టులు అప్పజెప్పాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను బంద్ పెట్టయినా సరే.. వాళ్లు తెచ్చే సొలార్ పవర్ ను కొనాలని కేంద్రం నిబంధనలు  పెట్టారన్నారు..  సొలార్ పవర్ కొనకపోతే ఫైన్లు విధిస్తామన్నారన్నారు. బీజేపోళ్లను తరిమి కొట్టకపోతే దేశం నాశనమవుతుందన్నారు.