సీతక్కపై కేసీఆర్ సీరియస్.. ఏదిపడితే అది అడగొద్దు

సీతక్కపై కేసీఆర్ సీరియస్.. ఏదిపడితే అది అడగొద్దు

గ్రామాలను ఇచ్చే నిధులపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. గ్రామ పంచాయతీ నిధులు దారి మల్లిస్తున్నారన్న ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అసెంబ్లీలో ప్రశ్నించారు. పంచాయతీ సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వానికి ఎందుకు ఉలికిపాటన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా స్పీకర్ పోచారం, ఎమ్మెల్యే సీతక్క మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ప్రభుత్వాన్ని పొగిడితేనే సమయం ఇస్తారా అంటూ స్పీకర్ ను ప్రశ్నించారు సీతక్క. 

పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులంటూ ఉండవన్నారు సీఎం కేసీఆర్... రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సిందేనన్నారు. అవి కేంద్రం డబ్బులు కాదని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అడిగిన ప్రశ్నపై సీరియస్ అయ్యారు. ప్రశ్న అడిగే హక్కుందని ఏది పడితే అది అడగొద్దన్నారు సీఎం. కేంద్ర దయాదాక్షిణ్యం ఏమీ ఉండదన్నారు. అవగాహన లేకుండా రాష్ట్రాన్ని నడిపిస్తున్నామా అని ప్రశ్నించారు కేసీఆర్. నిధుల మళ్లింపు అనేదే లేదన్నారు... కాంగ్రెస్ హయాంలోని PWS బిల్లులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయన్నారు సీఎం. 

see more news

చైనాకు సీక్రెట్‌‌‌‌‌‌‌‌ కాల్స్ చేశాం .. ఒప్పుకున్నఅమెరికా ఆర్మీ జనరల్‌‌‌‌

సీతక్క వర్సెస్ స్పీకర్: ప్రభుత్వాన్ని పొగిడితేనే సమయం ఇస్తారా?