
జోగులాంబ గద్వాల జిల్లాలో మిద్దెకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. అయిజ మండలం కొత్తపల్లిలో గోడ కూలి ఒకే కుటుంబంలోని ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుల్లో ఇద్దరు దంపతులు మోషా, శాంతమ్మ, వారి కుమారులు చరణ్, తేజ, రాము, చిన్న ఉన్నారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఏడుగురు ఉన్నారు. ప్రస్తుతం మొత్తం కుటుంబంలో ఒక చిన్నారి స్నేహ మాత్రమే మిగిలింది. స్నేహకు కూడా తీవ్ర గాయాలు కావటంతో హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. మోషా, శాంతమ్మ భువనగిరిలో ఇటుక బట్టీల్లో పనిచేసేవాళ్లని చెబుతున్నారు గ్రామస్తులు. మరో రెండు రోజుల్లో భువనగిరికి వెళ్లాలని అనుకోగా.. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందంటున్నారు.
గద్వాల్ జిల్లా అయిజ మండలం కొత్తపల్లిలో గోడకూలి ఆరుగురు చనిపోయిన ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు మంత్రి నిరంజన్ రెడ్డి. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. చిన్నారికి విద్య, వైద్య పరంగా అన్ని సౌకర్యాలు కలిపిస్తామన్నారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు మంత్రి.
మరిన్ని వార్తల కోసం
ఎవరు బాగా చేస్తారో వాళ్లకే ఓటేశా
ఈ ఫుడ్స్.. 25 ఏండ్ల తర్వాత కూడా తినొచ్చు
అత్తమామలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు