ఈ ఫుడ్స్.. 25 ఏండ్ల తర్వాత కూడా తినొచ్చు

V6 Velugu Posted on Oct 10, 2021

ఆకలికి రూపం లేకపోయినా అందర్నీ వెంటాడుతుంది. అందుకే కూటి కోసం కోటి తిప్పలు పడుతుంటారు. కానీ.. ఏదో ఒక టైంలో మాత్రం పేద, ధనిక తేడా లేకుండా ఇద్దరికీ ఒకేలా కనిపిస్తుంది ఆకలి. ఏదైనా ఎమర్జెన్సీ లేదా ప్యాండెమిక్‌‌ లాంటి సిచ్యుయేషన్స్​ వచ్చి తిండి దొరకనప్పుడు ఈ ఇద్దరూ.. దొరికింది తిని కడుపునింపుకోవాల్సిందే. అలాంటి టైంలో ఆదుకునేదే ఈ ఎమర్జెన్సీ ఫుడ్‌‌. ఇది కొన్నేళ్ల పాటు నిల్వ ఉంటుంది. ఫుడ్‌‌ దొరకని టైంలో అంటే.. ఆహార సంక్షోభం వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల వల్ల తిండి దొరకనప్పుడు.. ఇది తిని కొన్నాళ్లపాటు బతకొచ్చు.

పీక్ రీ ఫ్యూయల్ సర్వైవల్ ఫుడ్

 ఈ ఫుడ్‌‌ బ్యాగ్‌‌ ఐదేళ్ల వరకు పాడవదు. ఇందులో హై క్వాలిటీ ఫుడ్‌‌ ఉంటుంది. ప్రకృతి విపత్తులు వస్తాయనుకున్నప్పుడు ఈ ఫుడ్ కొని పెట్టుకుంటే చాలు. కొన్ని రోజుల పాటు హాయిగా, ఆరోగ్యంగా బతకొచ్చు. తక్కువ రోజులు వ్యాలిడిటీ ఉన్న ఈ ఫుడ్‌‌ రుచి చాలా బాగుంటుందని ఈ ప్రొడక్ట్స్‌‌ని ఎక్కువమంది కొంటుంటారు. కొన్న తర్వాత ఐదేళ్లలోపు ఎలాంటి విపత్తులు రాకపోతే ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉన్నప్పుడే తింటే సరిపోతుంది. ఈ కంపెనీ నుంచి అనేక రకాల ఫుడ్స్  వచ్చాయి. ముఖ్యంగా ఇందులో క్వాలిటీ మీట్‌‌ ఉంటుంది. తక్కువ నీళ్లతో వండొచ్చు. అమెజాన్‌‌లో ఆర్డర్​ చేసుకోవచ్చు. 

రెడీ వైజ్ ( ReadyWise)

ఎక్కువ రోజులు స్టోర్‌‌‌‌ చేసుకుని తినగలిగే ఫుడ్‌‌ని ఈ కంపెనీ తయారుచేస్తోంది. రెడీ వైజ్‌‌ సర్వైవల్‌‌ ఫుడ్‌‌ని పాతికేళ్ల వరకు స్టోర్‌‌‌‌ చేసుకోవచ్చు. ఈ పాతికేళ్లలో తిండి దొరకని పరిస్థితులు వస్తే చాలా ఈజీగా వండుకుని తినేయొచ్చు. ఫ్రీజ్–డ్రైడ్​ ఫుడ్‌‌ని అమ్ముతారు వీళ్లు. డీహైడ్రేటెడ్ టెక్నాలజీని వాడి ఈ ఫుడ్‌‌ తయారుచేస్తారు. ముఖ్యంగా గ్లూటెన్ -ఫ్రీ ఫుడ్‌‌ని వీళ్లు అమ్ముతున్నారు. అంతేకాదు ‘‘ఆర్గానిక్ ఎమర్జెన్సీ బకెట్” ని అమ్మకానికి పెట్టారు. ఆర్గానిక్‌‌ పద్ధతుల్లో పండించిన ఫుడ్‌‌ని పాతికేళ్లు పాడవకుండా ఉండేలా చేశారు. ఆన్‌‌లైన్‌‌లో ఆర్డర్‌‌‌‌ పెట్టి తెప్పించుకోవచ్చు. 52 సర్వింగ్ ప్రిప్పర్ ప్యాక్, 60 సర్వింగ్ ప్రోటీన్ ప్యాక్‌‌, 240 సర్వింగ్ ఎమర్జెన్సీ ప్యాకేజీ, 120 సర్వింగ్‌‌ బ్రేక్ ఫాస్ట్ బకెట్ అందుబాటులో ఉన్నాయి. రుచికరమైన స్ట్రోగానోఫ్, యాపిల్ సినమన్ వోట్ మీల్, బియ్యం, కూరగాయలతో చేసిన పాస్తా ఈ బ్యాగుల్లో ఉంటాయి.

వ్యాలీ ఫుడ్‌‌ స్టోరే

సర్వైవల్, ఎమర్జెన్సీ ఫుడ్‌‌ని అందించే కంపెనీల్లో ఇదొకటి. ఈ కంపెనీ ఫుడ్‌‌ పాతికేళ్ల షెల్ఫ్‌‌ లైఫ్ ఉంటుంది. గ్లూటెన్, పాలు లేని ఫుడ్‌‌ని అందిస్తుంది. వెజిటేరియన్స్‌‌ కోసం స్పెషల్‌‌ ప్యాక్‌‌లు కూడా ఉన్నాయి. పాన్‌‌కేక్‌‌లు, ఫెటుసిని ఆల్ఫ్రెడో, పాస్తా ప్రైమవెరా, టొమాటో బేసిల్ సూప్‌‌ లాంటివి ఈ బ్యాగ్‌‌లో ఉంటాయి. ఒక వ్యక్తికి నెలకు సరిపడా ఫుడ్‌‌ కొనాలంటే పదకొండు వేల రూపాయలు ఖర్చవుతుంది. 

మౌంటైన్ హౌస్ సర్వైవల్ ఫుడ్

మౌంటైన్ హౌస్ ఫ్రీజ్‌‌ చేసి, ఎండబెట్టిన ఇంగ్రెడియెంట్స్‌‌తో తయారు చేసే ఫుడ్‌‌ని అమ్ముతుంది. అల్పాహారంలో ఐస్ క్రీమ్ శాండ్‌‌విచ్‌‌లు, గ్రనోలా వంటివి ఉన్నాయి. ఈ ఫుడ్‌‌ దాదాపు 30 సంవత్సరాల వరకు రుచిగా ఉంటుంది. ఈ కంపెనీ 1969లో ఒరెగాన్‌‌లో మొదలైంది. ఇది మిలిటరీకి ఫ్రీజ్‌‌– డ్రైడ్‌‌ ఫుడ్స్‌‌ని సప్లై చేసేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సర్వైవల్‌‌ ఫుడ్‌‌ని అమ్ముతోంది.  

గుడ్-టు-గో

ఇది ముఖ్యంగా వెజిటేరియన్స్‌‌ తయారు చేసిన ఫుడ్‌‌ని అందు బాటులోకి తీసు కొచ్చింది. ఇండియన్స్ ఎక్కువగా తినే వెజిటబుల్స్‌‌ కుర్మా, మష్రూమ్, మెక్సికన్ క్వినోవా బౌల్ వంటివి అమ్ముతోంది. ఈ ఫుడ్‌‌ని ఎక్కువగా మౌంటెన్స్‌‌ ఎక్కేవాళ్లు. లాంగ్‌‌ జర్నీలు చేసేవాళ్లు తీసుకెళ్తుంటారు. ఈ ఫుడ్‌‌ను పది నిమిషాల్లో వండుకోవచ్చు. ఎలా వండుకోవాలనేది కూడా ప్యాక్​పై క్లియర్‌‌‌‌గా ఉంటుంది. దీన్ని కూడా దాదాపు ముప్పై ఏళ్ల పాటు స్టోర్‌‌‌‌ చేసుకోవచ్చు. 
 

Tagged few years, store, eate, Peak ReFuel Survival Food , Good to go

Latest Videos

Subscribe Now

More News