సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మర్కూక్ పంపు హౌజ్ ను సీఎం కేసీఆర్ .. చినజీయర్ స్వామితో కలిసి ప్రారంభించారు. 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లను ఏర్పాటు చేయగా, ఇందులో రెండు మోటార్లను స్విచ్చాన్ చేసి.. కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి కాళేశ్వరం జలాల ఎత్తిపోతను ప్రారంభించారు. గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్ డెలివరీ సిస్టర్న్ వద్దకు చేరుకోనున్నాయి. గోదావరి జలాలను చినజీయర్ తో కలిసి స్వాగతం పలికారు సీఎం కేసీఆర్.
అంతకుముందు కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు సీఎం. ఆ తర్వాత చండీయాగం పూర్ణాహుతిలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఎర్రవెల్లిలో రైతు వేదికకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం సుదర్శన యాగశాలకు చేరుకున్న సీఎం. చినజీయర్ స్వామితో కలిసి యాగంలో పాల్గొన్నారు. సుదర్శనయాగం పూర్ణాహుతి నిర్వహించారు సీఎం కేసీఆర్ దంపతులు.
కొండపోచమ్మ సాగర్ కట్ట దగ్గర డెలివరీ సిస్టర్న్ దగ్గరకు చేరుకున్నారు సీఎం. కాసేపట్లో డెలివరీ సిస్టర్న్ దగ్గర గోదావరి జలాలకు పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం వరదరాజుపూర్ లోని రాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం. 12.40 కి మర్కూక్ పంపుహౌజ్ వద్దకు చేరుకొని ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారుల సమావేశానికి హాజరుకానున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

