సీఎం కేసీఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు: వివేక్ వెంకట స్వామి

సీఎం కేసీఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు: వివేక్ వెంకట స్వామి

సీఎం కేసీఆర్ నిజాం సర్కార్ లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే… ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. విద్యుత్ బిల్లులు ఎక్కువ వేయడం…సకాలంలో చెల్లించని వారు ఇంట్రెస్టుతో బిల్లులు చెల్లించాలని అనటం సరైంది కాదన్నారు. వారం రోజులుగా పోరాటం చేస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 300 రూపాయల విద్యుత్ బిల్లు  వచ్చే వారికి 3వేలు బిల్లు వేశారన్నారు. ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రజలకు ప్రభుత్వం మేలు చేయాలి కానీ.. ప్రజలపై భారం మోపేలా చేయవద్దని సూచించారు. ఇక పోలీసులను కల్వకుంట్ల సేవకు అన్నట్లు మార్చిన సీఎం కేసీఆర్ కు… త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు వివేక్ వెంకట స్వామి.

ప్రజలపై ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్‌ బిల్లుల భారం మోపడంపై ఇవాళ(సోమవారం) వరంగల్ అర్బన్ లో వివేక్ వెంకట స్వామి…MPDCL ముందు నిరసన చేశారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు.