చరిత్రలో కేసీఆర్ గిరిజన ద్రోహిగా మిగిలిపోతారు

చరిత్రలో కేసీఆర్ గిరిజన ద్రోహిగా మిగిలిపోతారు

ఉద్యోగాల నోటిఫికేషన్ ల కోసం కేయూ విద్యార్ధి సునీల్ మరణాన్ని.. జాతీయ మానవ హక్కుల దృష్టికి తీసుకెళ్తం అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ప్రత్యేక తెలంగాణ పోరాటం జరిగిందని..కేసీఆర్ పరిపాలనలో ఇవేవీ జరగడంలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ చెప్పిందన్నారు. టీఎస్పీఎస్ లో కూడా ఖాళీలున్నాయని..అందులో ఒకేఒక్కడు మిగిలాడన్నారు. దాన్ని బట్టే ఉద్యోగాల భర్తీ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చని.. రాష్ట్రంలో లక్షల్లో ఖాళీలుంటే.. సీఎం కేసీఆర్ 50 వేలు భర్తీ చేస్తాననడం దారుణమన్నారు. మరోవైపు రిటైర్మెంట్ వయసు పెంచడం నిరుద్యోగులను మోసం చేసినట్లేనని..ఖాళీలను భర్తీ చేయకుండా.. రిటైర్మెంట్ వయసు పెంచడం ఏంటన్నారు. సునీల్ నాయక్ బలవన్మరణం.. సర్కార్ కు గొడ్డలి పెట్టు అని..సునీల్ స్టేట్మెంట్ వైరల్ అవుతుందన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుండి గ్రూప్ -1, 3 నోటిఫికేషన్ లు రాలేదని..జనాభా ప్రాతిపదిక ప్రకారం 12 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. 

రిజర్వేషన్ అందక గిరిజనులు, ఆదివాసీ యువత అన్యాయానికి గురవుతున్నారన్న జీవన్ రెడ్డి. గిరిజనులపట్ల సీఎం కేసీఆర్ వివక్షత చూపుతున్నారని..4 శాతం రిజర్వేషన్ కోల్పోతున్నారన్నారు. ఇక్కడ 10శాతం కూడా అమలుకావడం లేదని.. 
 చరిత్రలో కేసీఆర్ గిరిజన ద్రోహిగా మిగిలిపోతారన్నారు.  యువతకు సరైన ఉపాధి కల్పించడంలో సర్కార్ ఫెయిల్యూర్ అవుతుందన్న ఆయన..సునీల్ నాయక్.. త్యాగం ఊరికేపోదన్నారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి మరణం, ఇప్పుడు ఉద్యోగాల భర్తీ కోసం సునీల్ బలవన్మరణం.. కీలకమలుపు కానున్నాయన్నారు. సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని..306 ఐపీసీ ప్రకారం సీఎం కేసీఆర్ శిక్షకు అర్హుడన్నారు. నిరుద్యోగ యువత.. శాంతి యుతంగా పోరాటం చేయాలని.. అన్ని రాజకీయ పార్టీలు సంఘటితంగా.. ఉద్యోగాల భర్తీ, సామజిక తెలంగాణ కోసం పోరాటం చేయాలన్నారు జీవన్ రెడ్డి.