వడ్లు కొనొద్దని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశం

వడ్లు కొనొద్దని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశం

యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండబోవనే విషయాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు వివరించాలన్నారు సీఎం కేసీఆర్. ఒక్క కిలో వడ్లు కూడా కొనబోమని రైతులకు చెప్పలని కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు సీఎం. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలన్నారు. రాబోయే వానాకాలం పంట కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక రెడీ చేయాలని చెప్పారు. పత్తి, కంది సాగుపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పంటల సాగుతో పాటు.. పలు అంశాలపై క్యాంప్ ఆఫీస్ లో మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో ఆయన రివ్యూ చేశారు.