ఎన్నికల ముందు రాయి ఏదో.. రత్నం ఏదో ఆలోచించాలి: కేసీఆర్

ఎన్నికల ముందు రాయి ఏదో.. రత్నం ఏదో ఆలోచించాలి: కేసీఆర్

ఎన్నికల ముందు రాయి ఏదో.. రత్నం ఏదో ఆలోచించాలని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో ప్రజలంతా ఆలోచించాలని చెప్పారు. రైతుబంధు పుట్టించిందే కేసీఆర్ నుంచి అని వ్యాఖ్యానించారు. మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధును రూ. 16వేలకు పెంచుతామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో 3కోట్ల మందికి కంటి పరీక్షలు చేసినమన్నారు కేసీఆర్.

పెన్షన్ రూ. 200 నుంచి రూ. 2 వేలకు పెంచామని కేసీఆర్ చెప్పారు. పెన్షన్ దశలవారిగా రూ. 5016కు పెంచామన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. రైతుబంధు దుబారా అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు.. మరి రైతుబంధు దుబారానా అని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రల్లో నీటి పన్నులు ఉన్నాయని.. కేవలం తెలంగాణలో నీటి పన్నులు లేవని చెప్పారు. 

డోర్నకల్ లో రెడ్యా నాయక్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. డోర్నకల్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.