సర్పంచ్​గారూ.. ఊరెట్లుంది?

సర్పంచ్​గారూ.. ఊరెట్లుంది?
  • గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ సర్పంచ్ కు కేసీఆర్ ఫోన్

‘‘సర్పంచ్ గారూ ఊరు ఎట్లుంది? త్వరలో కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభించుకుంటున్నం. దీంతో రైతుల కష్టాలు తీరుతున్నయి. 1,500 మంది కూర్చునేలా గ్రామంలో కాన్ఫరెన్స్ హాల్ నిర్మించండి’’ అంటూ గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ సర్పంచ్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మర్కూక్ పంప్ హౌస్​ చివరిది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్​ను త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామ సర్పంచ్ కు సీఎం ఫోన్ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.