దళిత బంధు తో మొదలైన యజ్ఞం ఆగదు

V6 Velugu Posted on Oct 18, 2021

సీఎం కేసీఆర్‌ సమక్షంలో సోమవారం మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మోత్కుపల్లికి కండువా కప్పిన కేసీఆర్‌ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.

దళిత బంధు యజ్ఞంలా కొనసాగుతోందన్న సీఎం కేసీఆర్.. దళిత బంధు ఇక్కడికే ఆపం, ముందు ముందు కొనసాగిస్తామన్నారు. దళిత బంధు అమలు చేయాలని నాకు ఎవరు చెప్పలేదని.. నాకే ఆలోచన వచ్చిందన్నారు. దీని గురించి మొదట చెప్పింది మోత్కుపల్లికే అని అన్నారు. రాబోయే 7 ఏళ్లలో  తెలంగాణ పెట్టబోయే ఖర్చు 23 లక్షల కోట్లు అని అన్నారు. ఒక్క దళిత బంధుకు లక్షా 70 కోట్లన్నారు. బాగుపడాలన్న మనమే.. చెడగొట్టుకోవలన్న మనమేనన్న కేసీఆర్..రాజకీయంలో గెలుస్తాం.. ఓడుతం కానీ ఏమీ చేశామన్నది ముఖ్యమన్నారు. 

తెలంగాణ లో పెద్ద కులం దళిత కులమేనని అన్నారు. 75 లక్షల జనాభా ఉంది.. కానీ వాళ్లకు 25 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్నాయన్నారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించుకుందామని తెలిపారు. బంతిలో కూసుంటే.. ఎదో ఒక కొసకెళ్లి వడ్డిస్తారన్నారు. అలాగే దళిత బంధు కూడా అంతేనని.. పార్టీలు, రాజకీయాలు కాకుండా కేవలం దళితులైతే చాలన్నారు. దళిత బంధు అందుతుందన్నారు. ఆరు నూరైనా దళిత బంధు అందరికి అమలు చేస్తామని స్పష్టం చేశారు. దళిత ఉద్యోగులకు కూడా దళిత బంధు ఇస్తామని అన్నారు. కొందరికి అవగాహన లేక  గందరగోళం చేస్తున్నారని అన్నారు. ఇది దళిత బంధు తో మొదలైన యజ్ఞం ఆగదని.. తర్వాత అందరికీ వస్తదన్నారు. గిరిజనులు, బీసీ,ఈబీసీ అందరికీ వస్తుందన్నారు.

కులం తో పనేముందన్న సీఎం కేసీఆర్.. పేదరికమే లెక్క అన్నారు. బ్రాహ్మణులలో పేదవాళ్ళు లేరా అని ప్రశ్నించారు. యాదవులకు గొర్రెలు ఇప్పిస్తే దళితులు పిచ్చి కామెంట్స్ చేయలేదన్నారు. దళిత బంధు..సంకుచిత భావాల తో పెట్టిన స్కీం కానే కాదన్న కేసీఆర్.. ఆరు నూరైనా ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు.

Tagged CM KCR, plan, stop, Dalit bondhu

Latest Videos

Subscribe Now

More News