వర్షాలతో రూ. 8 వేల కోట్ల పంట నష్టం వస్తే.. కేంద్రం రూ. 8 కూడా ఇవ్వలే: కేసీఆర్

వర్షాలతో రూ. 8 వేల కోట్ల పంట నష్టం వస్తే.. కేంద్రం రూ. 8 కూడా ఇవ్వలే: కేసీఆర్

వర్షాలతో రూ. 8 వేల కోట్ల నష్టం వస్తే కేంద్రం రూ. 8 కూడా ఇవ్వడంలేదని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‎లో వరదలొచ్చినప్పుడు కేంద్ర బృందమే రాలేదని ఆయన అన్నారు. గోదావరి ఉధృతి పెరగడం వల్లే పంటలు మునుగుతున్నాయని.. పంటలు నీళ్లలో ఎక్కువ రోజులు ఉంటేనే దెబ్బతింటాయని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడుతూ కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.

‘నేను ఓ రైతుగా చెబుతున్నా.. ఫసల్ బీమా అనేది ఒట్టి బోగస్. నిపుణులు చేసిన సూచనలను కేంద్రం ఏనాడు పట్టించుకోలేదు. ఫసల్ బీమా ప్రీమియం కట్టేందుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు. ఫసల్ బీమాలో నష్టపరిహారం గ్రామం మొత్తం మునిగితేనే వస్తుంది. అందుకే రైతులు ప్రీమియం కట్టడం లేదు. అసలు పంటల బీమా దేశంలో శాస్త్రీయంగా లేదు. స్టాక్ ఎక్కువైందని వడ్లు కొనమని కేంద్రం చెబితే.. రాష్ట్రాలు, రైతులు ఏం చేయాలి. ఓ సారి పంటలు తక్కువ పండితే.. మరోసారి పంటలు ఎక్కువ పండుతాయి. పంటలు ఎక్కువ పండాయని కొనమని చెబితే రైతులు ఎటుపోవాలి? పంటలు పండని విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడానికి కేంద్రం బఫర్ స్టాక్ పెట్టుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బఫర్ స్టాక్ అనే అంశమే లేదు. వ్యవసాయ రంగంలో మార్పులు రావాలని, తీసుకురావాలని కేంద్రమంత్రికి కూడా చెప్పాను. ఇన్సూరెన్స్ విషయంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కేంద్రంతో చర్చ జరపాలి. రాష్ట్రంలో అమలు చేస్తున్న ధరణి చాలా విజయవంతంగా నడుస్తోంది. 
కౌలు రైతులకు రైతుబంధు చేస్తే అసలు రైతులకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయం కౌలు రైతులు, అసలు రైతులు మాట్లాడుకోవాలి. కౌలు రైతులను మానవీయ కోణంలో ఆదుకుంటాం. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేల అధ్వర్యంలో గ్రామ కమిటీ వేసి పరిష్కరించుదాం. ఆ తర్వాత పట్టాలు ఇచ్చి రైతుబంధు మరియు భీమా కూడా ఇస్తాం’ అని సీఎం అన్నారు.

For More News..

కౌలు రైతులను మేం పట్టించుకోం: సీఎం కేసీఆర్

పండుగపూట పెట్రో మంట.. వరుసగా నాలుగో రోజు బాదుడు