కౌలు రైతులను మేం పట్టించుకోం: కేసీఆర్

కౌలు రైతులను మేం పట్టించుకోం: కేసీఆర్

హైదరాబాద్: కౌలుకు భూములు సాగుచేస్తున్న రైతుల విషయం మేం పట్టించుకోమని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అన్నారు. రైతులకు రైతుబంధు ఇస్తున్నట్లే.. కౌలుకు చేస్తున్న రైతులకు కూడా రైతుబంధు ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా వినతులు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన కేసీఆర్.. ఇన్సూరెన్స్ విషయంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కేంద్రంతో చర్చ జరపాలని అన్నారు. కౌలు రైతుల విషయాన్ని మేం పట్టించుకోమని స్సష్టం చేశారు. కౌలు రైతులను అఫిషల్ చేస్తే అసలు రైతులకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ అన్నారు. కౌలు రైతులను మానవీయ కోణంలో ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కౌలు రైతుల కోసం ఎమ్మెల్యేలు ఇప్పటికే నాతో లొల్లి చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. 

విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడానికి కేంద్రం బఫర్ స్టాక్ పెట్టుకుంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బఫర్ స్టాక్ అనే అంశమే లేదని కేసీఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో మార్పులు రావాలని, తీసుకురావాలని కేంద్రమంత్రికి కూడా చెప్పినట్లు సీఎం తెలిపారు. ఎమ్మెల్యేల అధ్వర్యంలో గ్రామ కమిటీ వేసి పోడు భూముల సమస్యలను నెల లేదా రెండు నెలల్లో పరిష్కరిస్తామని.. ఆ తర్వాత పట్టాలు ఇచ్చి రైతుబంధు మరియు భీమా ఇస్తామని సీఎం చెప్పారు.

For More News..

వివేక్ వెంకటస్వామిని సన్మానించిన హుజూరాబాద్ నేతలు

పండుగపూట పెట్రో మంట.. వరుసగా నాలుగో రోజు బాదుడు