నల్గొండ నా దత్తతలోనే ఉంది : సీఎం కేసీఆర్​

నల్గొండ నా దత్తతలోనే ఉంది : సీఎం కేసీఆర్​
  • నా డ్యూటీ, ఎమ్మెల్యే భూపాల్​ డ్యూటీ ఇంకా అయిపోలే 
  •     నకిరేకల్​ నియోజకవర్గం పైనా ప్రత్యేక దృష్టి పెడ్తా
  •     కోమటిరెడ్డి డబ్బు మదంతో మాట్లాడుతున్నడు
  •     బ్రహ్మణ వెల్లంల, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలు కంప్లీట్​ చేసినం
  •     కరోనా వల్ల నల్గొండ అభివృద్ధి ఏడాది ఆలస్యమైంది
  •     భూపాల్​ను, చిరుమర్తిని మళ్లీ గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం
  •     ప్రజా ఆశ్వీరాధ సభలో సీఎం కేసీఆర్​

నల్గొండ /నకిరేకల్​ వెలుగు : ‘నల్గొండ పట్టణం నగరం రూపు కనిపిస్తోంది. ఒక్క రూపాయికే నల్లా కనె క్షన్​ ఇచ్చి ప్రతి పేదవాడికి నీళ్లు ఇస్తున్నం. నల్గొండ నియోజకవర్గం నా దత్తతలోనే ఉంది. నా డ్యూటీ, భూపాల్​ డ్యూటీ ఇంకా అయిపోలే. మీరు చూసిన దానికంటే ఇంకా ఎన్నో రెట్లు మేం చేసి చూపించాల్సి ఉంది’. అని సీఎం కేసీఆర్​ అన్నారు. సోమవారం నల్గొండ, నకిరేకల్​ ప్రజా ఆశ్వీరాద సభలో ఆయన మాట్లాడారు. 

2018 ఎన్నికల్లో నల్గొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్నానని, అయితే  కరోనాతో  ఏడాది ఆలస్యం జరిగిందన్నారు. ఆ తర్వాత పనులు మొదలు పెట్టామని, ఈ రోజు నల్గొండ పట్టణం ఎట్లా తయారైందో ప్రజల కళ్ల ముందే కనిపిస్తుందన్నారు. ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డి పట్టుబట్టి తనను, కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చి రూ.14 00 కోట్లు శాంక్షన్​ చేయించాడని చెప్పారు. నల్గొండకు ఇప్పటికే  ఐటీ టవర్​ రావడంతో  15 వందల మంది ఉద్యోగాలు దొరుకుతున్నాయని వివరించారు. 

ఇంతకుముందు రెండు దశాబ్ధాలు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి  టైంలో నల్గొండ పట్టణం ఎట్లా ఉండే? మంచినీళ్లు, కరెంట్​ఎట్లుండేదని ప్రశ్నించారు. వట్టిగా అడ్డం పొడువు మాట్లాడుడుకాదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలని కోరారు. 
 
కాంగ్రెస్ పాలనలో ఒక్క మెడికల్​కాలేజీ లేదు

50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పాత నల్గొండ జిల్లాకు ఒక్క మెడికల్​కాలేజీ రాలేదని,  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో మూడు మెడికల్​ కాలేజీలు వచ్చాయని సీఎం చెప్పారు. నల్గొండలో 5,6 వందల బెడ్లతో సూపర్​ స్పెషాలిటీ వచ్చిందని, బ్రహ్మణ వెల్లంల, ఉదయ సముద్రం ప్రాజెక్టులు కంప్లీట్​ చేసుకోగలిగామన్నారు. గతంలో నల్గొండలో తిరిగితే లక్షల ఎకరాల్లో ఆముదం పంటలు కనిపించేవని, ఇప్పుడు కనగల్​, తిప్పర్తి, నల్గొండ రూరల్​ మండలాల్లో పచ్చని పంటలు  పండుతున్నాయని చెప్పారు.

 నల్గొండలో గత పదే ళ్లలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని,  కులం, మతం తేడా లేకుండా అభివృద్ధి చేశామని చెప్పారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్​రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్​రావు, ఎంసీ కోటిరెడ్డి డాక్టర్​ చెరుకు సుధాకర్​, మున్సిపల్​ చైర్మన్​ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నర్రా రాఘవరెడ్డి పేరు నిలబెట్టండి  

‘వట్టి కోట ఆళ్వార్‌‌‌‌స్వామి పుట్టిన జిల్లా ఇది. నర్రా రాఘవరెడ్డి ఉద్యమాలు చేసిన గడ్డ. బాగా చైతన్యం ఉండే ప్రాంతం. ఆనాడు రాఘవరెడ్డి అసెం బ్లీలో కరెంట్​కోతలతో ఎండిన వరి కంకులు చూపించేవారు. కమ్యూనిస్టు సోదరులకు చెబుతున్నా. ఈ ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్యకు మద్దతు ఇవ్వాలి’ అని సీఎం నకిరేకల్ సభలో కోరారు.  

ధర్మారెడ్డి కాలువ, పిలాయిపల్లి, బీవెల్లంల ప్రాజె క్టు ట్రయల్​రన్​ పూర్తయ్యిందని, వచ్చే ఐదారు మాసాల్లో నీళ్లు తెప్పించే బాధ్యత తనేదనని హామీ ఇచ్చారు. కాలేశ్వరం లింక్‌‌‌‌చేసి భువనగిరి దగ్గర ఉ న్నబస్వాపుర్‌‌‌‌రిజర్వాయర్​ నుంచి మన రామన్నపేట మండలానికి నీళ్లు ఇస్తామని మాటిచ్చారు.