దళితుల అకౌంట్లోకే నేరుగా డబ్బులు

దళితుల అకౌంట్లోకే నేరుగా డబ్బులు

దళితుల అభివృద్ధి, సంక్షేమంపైనా సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ కొనసాగుతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి వెళ్లినా ఆర్థికంగా పీడిత వర్గాలు దళితులేనని సీఎం కేసీఆర్ అన్నారు. దళితులకు ఉన్న ఈ బాధ పోవాలన్నారు. దళితుల సామాజిక, ఆర్థిక బాధలు పోవాలంటే తీసుకోవాల్సిన చర్యలు... వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  దళిత సమాజం ముందుకు వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లీడర్లు సూచనలు చేయాలని పిలుపునిచ్చారు.  ఈ సమావేశానికి కాంగ్రెస్, మజ్లిస్, సీపీఎం, సీపీఐ నేతలు హాజరయ్యారు.

ఈ మీట్‌లో సీఎం మాట్లాడుతూ.. దళిత సాధికారత పథకానికి, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు సంబంధం లేదని స్ఫష్టం చేశారు. ఎంపవర్‌మెంట్ స్కీంకు ప్రత్యేకంగానే నిధులు ఖర్చు చేస్తామని సీఎం అన్నారు. దళితుల్లో వెనుకబాటుతనాన్ని తొలిగించే క్రమంలో కలెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర కీలకం కాబోతున్నదని కేసీఆర్ అన్నారు. ఈ పథకం కింద అర్హులను  పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసి డబ్బులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చూడాలని కేసీఆర్ అన్నారు.