ధాన్యం కొనేదాకా కొట్లాడుతూనే ఉంటాం

ధాన్యం కొనేదాకా కొట్లాడుతూనే ఉంటాం

నీటి పన్ను వసూలు చేయకుండా.. నీళ్లు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘రైతుల వద్దకు వెళ్లినప్పుడు వారడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాలి కదా? పంజాబ్‎లో ధాన్యం కొన్నట్లుగా.. కేంద్రం తెలంగాణలో ధాన్యం కొంటదా..? కొనదా..? కొనేదాకా కొట్లాడుతూనే ఉంటాం. యాసంగిలో వడ్లు వేయండని బండి సంజయ్ చెబుతున్నాడు. ఇదే మాట మీద నిలబడతాడా? లేదంటే ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడి.. ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టిస్తే.. ఎవరూ సహించరు. గత యాసంగిలో తీసుకుంటామన్న 5 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకుంటరా.. లేదా? వచ్చే యాసంగి విషయంలో కూడా తేల్చి చెప్పాలి. యాసంగి ధాన్యం ఎంత పండినా తీసుకుంటామని కేంద్రం నుంచి లెటర్ తీసుకురావాలి. లెటర్ తీసుకురాకుండా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను తప్పుదోవ పట్టిస్తే ఎలా? కొనుగోలు కేంద్రం వద్ద నువ్వు చేసేదేంది? కొంపలంటుకున్నట్లు తెలివిలేని మాటలు మాట్లాడి.. అరాచకం సృష్టిస్తానంటే నీకే దెబ్బపడతది. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, జడ్పీ చైర్మన్లు ఎల్లుండి 18న ధర్నా నిర్వహిస్తాం. మిమ్మల్ని వదిలిపెట్టం. మొత్తం రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలసి 18న ధర్నా చేసి ప్రశ్నించబోతున్నుం.  రేపు పొద్దున్నే కేంద్ర ఆహారశాఖ మంత్రికి, ప్రధాన మంత్రికి లేఖ పంపిస్తా. ఆగమైన తెలంగాణ రైతుల బతుకులను తీర్చిదిద్దుతున్నాం. కరోనా సమయంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొత్తం ధాన్యం కొన్నాం. రైతుబంధు కూడా ఇచ్చాం.. ఇస్తున్నాం. పిచ్చోళ్ల మాటలు నమ్మి వడ్లు వేసి నష్టపోవద్దు’ అని కేసీఆర్ అన్నారు.