నిర్వాసితుల కోసం కొత్త గజ్వేల్ నగరం నిర్మిస్తున్నాం

నిర్వాసితుల కోసం కొత్త గజ్వేల్ నగరం నిర్మిస్తున్నాం

సిద్దిపేట జిల్లా: కొండ పోచమ్మ సాగర్ ప్రారంభం తెలంగాణ చరిత్రలో ఉజ్వలమైన ఘట్టం అన్నారు సీఎం కేసీఆర్. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని మర్కూక్-పాములపర్తి గ్రామాల సమీపంలో 15 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం కొండపోచమ్మ రిజర్వాయర్ ను చినజీయర్‌ స్వామిజీతో కలిసి సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చినవారికి తలవంచి నమస్కారం చేస్తున్నానన్నారు. వారి త్యాగం వల్లే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయని చెప్పారు సీఎం కేసీఆర్.

ప్రాజెక్టుల నిర్వాసితులకు మంచి పరిహారం ఇచ్చాంగానీ..వారికి గూడు లేని బాధ ఉందని.. దీనిని దృష్టిలో పెట్టుకుని నిర్వాసితుల కోసం కొత్త గజ్వేల్ నగరం నిర్మిస్తున్నామని తెలిపారు సీఎం. భూములు కోల్పోయినవారి త్యాగాలు వెలకట్టలేనివని.. వారి కుటుంబాలకు ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు సీఎం కేసీఆర్.