
కేంద్రం వడ్లు కొనకపోతే బీజేపీ వెంటాడుతాం.. వేటాడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. వడ్లు కొనకపోతే వదిలేది లేదని ఆయన అన్నారు. ‘టీఆర్ఎస్ వేట ప్రారంభించింది.. మేం ఉద్యమకారులం. రైతుల ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తాం. ఏది ఏమైనా రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకుంటాం. మేం కోరేదల్లా రైతులు బాగుపడాలి. వారు మంచి పంటలు పండించాలని కోరుకుంటున్నాం. వడ్ల కొనుగోలు విషయంలో ద్వంద్వ వైఖరి కాకుండా స్పష్టంగా తేల్చి చెప్పే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని వేదికలపై వెంటాడుతాం.. ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని కేసీఆర్ అన్నారు.