ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసును పరిశీలించిన కేసీఆర్

ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసును పరిశీలించిన కేసీఆర్

ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసును సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఆయన ఆఫీసుకు చేరుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆఫీసు మొత్తం కలియదిరిగారు. పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. అలాగే యాగం, పూజల ఎలా జరుగుతున్నాయని సీఎం ఆరా తీశారు.  కొద్దిసేపు అక్కడ ఏర్పాట్లను పరిశీలించిన కేసీఆర్ తిరిగి వెళ్లిపోయారు. 

ఉదయం నుంచి బీఆర్ఎస్ కార్యాలయంలో యాగాలు, ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాజశ్యామల యాగం కొనసాగుతోంది. దాదాపు 12 మంది రుత్వికులు గణపతి పూజతో యాగాన్ని ప్రారంబించారు. రేపు నవ చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. రేపు జరిగే బీఆర్ఎస్ ఆఫీసు ఓపెనింగ్ కు జాతీయ పార్టీల నేతలు కూడా వస్తారని బీఆర్ఎస్ లీడర్లు చెబుతున్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు.