ఎమ్మెల్యేల జీతం రూ.40 వేలు పెంచిన సీఎం

ఎమ్మెల్యేల జీతం రూ.40 వేలు పెంచిన సీఎం

ఎమ్మెల్యేల జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.  ఎమ్మెల్యేల జీతాలను ఒక్కొక్కరికి నెలకు రూ.40వేలు  పెంచుతున్నట్లు మమతా బెనర్జీ  సెప్టెంబర్ 7న ప్రకటించారు.  అసెంబ్లీలో ప్రకటన చేసిన మమతా బెనర్జీ .. తన  జీతంలో ఎటువంటిమార్పు లేదని చెప్పారు.  కొన్నేళ్లుగా సీఎంగా ఉన్న మమతా బెనర్జీ ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేల జీతం చాలా తక్కువ  కాబట్టి వారి జీతాలను  40 పెంచుతున్నట్లు చెప్పారు. 

పెంచిన జీతాలతో పశ్చిబెంగాల్ ఎమ్మెల్యేల జీతాలు రూ. 10 వేల నుంచి 50 వేలకు పెరుగుతాయి. మంత్రుల జీతాలు 10900 నుంచి రూ. 50,900కి పెరుగుతాయి.  కేబినెట్  మంత్రుల జీతాలు  రూ. 11 వేల నుంచి 51 వేయికి పెరుగుతాయి.  అయితే అలవెన్సులు, వాహన ఖర్చులు, ఇతర ప్రయోజనాలు  వీటికి అదనం. ఇవన్నీ కలిపితే ఒక్కొక్క ఎమ్మెల్యేకు లక్ష రూపాయలకు పైగా అందుతున్నాయి.