
సికింద్రాబాద్ స్క్రాప్ గోడౌన్ అగ్ని ప్రమాద ఘటనపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 11 మంది చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలిపిన నితీశ్ కుమార్ రూ. 2లక్షల పరిహారం ప్రకటించారు. డెడ్ బాడీలను స్వస్థలాలకు రప్పించేందుకు అవసరమైన ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకరాలు అందిస్తోందని.. రూ.5లక్షల పరిహారం కూడా ప్రకటించిందని నితీశ్ స్పష్టం చేశారు.