చందాపూర్ ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

చందాపూర్ ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

సంగారెడ్డి జిల్లా చందాపూర్ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలి పారు సీఎం రేవంత్ రెడ్డి. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి అలెర్ట్ చేశారు. 

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక SB ఆర్గానిక్స్ లో రియాక్టర్లు పేలడంతో ముగ్గురు కార్మికులు చనిపోయారు.10మంది కార్మికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో మొత్తం 50 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చికిత్సకోసం గాయడిన వారిని సంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. రియాకర్టర్ పేలిన తాకిడికి పరిశ్రమ ప్రాంతాల్లోని పలు నిర్మాణాలు కూలిపోయాయి.రియాక్టర్ పేలడంతో స్థానికులు భయాందోళనకు గురవు తున్నారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..పరిశ్రమ పరిసర ప్రాంతాలనుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.

ఫ్యాక్టరీలో మొదట ఒక రియాక్టర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మేనేజర్ రవితోపాటు మరో నలుగురు కార్మికులు చనిపోయినట్లు నిర్ధారించారు. పేలుడు ధాటికి డైరెక్టర్  రవి, సుబ్రమణ్యం, సురేష్ , పాల్,దామోదర్ స్పాట్ లోనే చనిపోయారు.  దాదాపు 10మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. నాలుగు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు ఫైర్ సిబ్బంది. రియాక్టర్ పేలుడుతో సమీపంలోని మూడు భవనాలు కుప్పకూలాయి. ఈ శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు ఉండొచ్చని సహాయక చర్యలు చేపట్టారు.