హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మినిస్టర్ దుదిళ్ల శ్రీధర్ బాబు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించడానికి 11 రోజులపాటు అమెరికా, దక్షణ కొరియా దేశాల్లో వారు పర్యటించారు. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో వివిధ కంపెనీల పెట్టబడులు  పెట్టాలని ఆయా ప్రతినిధులను కోరారు. ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి విదేశీ పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. 

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ లోని కోకాపేట్ GAR బిల్డింగ్ దగ్గర ఏర్పాటు చేయనున్న కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.