
- ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్
- అవసరమైన ఎక్విప్మెంట్ కొనుగోలుకు సీఎం రేవంత్ ఆదేశం
- ఏటా సెప్టెంబర్, అక్టోబర్‌లోనే భారీ వర్షాలు, వరదలు
హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర సర్కార్అలర్ట్ అయింది. ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నది. గత కొన్నేండ్లుగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే భారీ వర్షాలు, వరదలు వస్తున్నాయి. దీంతో వేల కోట్ల నష్టం జరగడంతో పాటు పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారు. ఇలా తరచూ వరదలు వస్తున్నందున, వాటి నియంత్రణకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో తెలంగాణ డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్ (టీజీడీఆర్ఎఫ్) ఏర్పాటు చేసింది. యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లాల్లోనూ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
టీజీడీఆర్ఎఫ్ కు ప్రత్యేకంగా ఫండ్స్ కేటాయించడంతో పాటు ఒక హెలికాప్టర్ కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని తెలిసింది. విపత్తులు సంభవించినప్పుడు దీన్ని వాడుకోవాలని సర్కార్ భావిస్తున్నది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాల్లో ఒక్కో దాంట్లో వంద మంది సిబ్బంది ఉండనున్నారు. వాళ్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అలాగే వరదలు వచ్చినప్పుడు బాధితులను రెస్య్కూ చేసేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ను కూడా కొనుగోలు చేయనున్నారుఈ మేరకు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
అన్ని శాఖల సమన్వయంతో..
వర్షాలు, వరదలు వచ్చినప్పుడు అన్ని శాఖలు సమన్వ యంతో పనిచేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఇందులో పోలీస్, ఫైర్, రెవెన్యూ, హెల్త్, ఇరిగేషన్‌తో పాటు ఇతర విభాగాలను భాగస్వామ్యం చేయనున్నారు. అలాగే గత 50 ఏండ్లలో కురిసిన వర్షాలు, వచ్చిన వరదల సమాచారం సేకరించాలని నిర్ణయించారు. ఎప్పుడెప్పుడు ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? ఎక్కడ ఎక్కువగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది? అనే వివరాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.
ప్రధానంగా గత పదేండ్లలో రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలపై స్టడీ చేయాలని, దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్‌రెడీ చేసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. అదే విధంగా చెరువులు, నాలాల ఆక్రమణలను తొలగించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఫ్లడ్స్‌పై యాక్షన్‌ప్లాన్ ను పట్టించుకోలేదు. ప్రతిఏటా వరదలు వస్తున్నప్పటికీ, ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
ఏటా కొంతమందికి శిక్షణ..
యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అన్ని శాఖల నుంచి ప్రభుత్వం వివరాలు సేకరిస్తున్నది. ప్రధానంగా ఇరిగేషన్డిపార్ట్మెంట్నుంచి ప్రాజెక్టుల నీటి నిల్వ, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో, చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, వరద కాలువల విస్తీర్ణం, అవి వెళ్లే మార్గాలపై పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకుంటున్నది. గోదావరి, ఇతర నదుల దగ్గరున్న గ్రామాలు, ప్రాజెక్టుల దగ్గరున్న ముంపు గ్రామాలు, వరద కాల్వల దారిలో ఉన్న వంతెనలు, రోడ్లు ఇలా.. ప్రతి దాని సమాచారం సేకరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందో ముందే తెలిస్తే, అక్కడ వరదలు వచ్చినప్పుడు ఈజీగా ఎదుర్కోవచ్చునని భావిస్తున్నారు.
ఎప్పుడెప్పుడు వర్షాలు వస్తున్నాయి ? ఏ కారణంతో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి? భారీ వర్షాల నమోదు శాతం ఎక్కడెలా ఉంది? అనేది గత 50 ఏండ్ల డేటాను వాతావరణ శాఖ నుంచి సేకరించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపైనా స్టడీ చేయాలని చెప్పింది. ఎన్డీఆర్ఎఫ్ మాడ్యుల్స్ఆధారంగా యాక్షన్ప్లాన్రెడీ చేయనున్నారు. వరదల సమయంలో ఏయే శాఖలు సమన్వయంతో పనిచేయాలనే దానిపైనా కూడా నివేదిక తయారు చేస్తున్నారు. పోలీస్, ఫైర్, రెవెన్యూ, హెల్త్, ఇరిగేషన్ శాఖల నుంచి కొంతమంది ఉద్యోగులకు ప్రతిఏటా వర్షాలు, వరదాలపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఎన్డీఆర్ఎఫ్వచ్చేలోగా రాష్ట్రంలోని బృందాలు ముంపు ప్రాంతాల్లోని బాధితులను రక్షించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
ఏటా ఒకే టైమ్‌లో వరదలు..
గత పదేండ్ల డేటాను విశ్లేసిస్తే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మొద ట్లోనే భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. కొన్ని జిల్లాలు పాక్షికంగా, 12 జిల్లాలు పూర్తిగా వరద లకు ప్రభావితమవుతున్నట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇందులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహ బూబాబాద్, జయశంకర్ భూపాల పల్లి, ములుగు, కొమ్రంభీమ్ ఆసిఫాబా ద్, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచి ర్యాల, వరంగల్, హనుమకొండ, నిర్మల్ ఉన్నాయి. రాష్ట్రంలో గత 8 ఏండ్ల రికార్డులను పరిశీలిస్తే రెండు, మూడేండ్లు తప్ప.. ప్రతిఏటా భారీగానే వరదలు వచ్చాయి.