ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు TSPSC ఛైర్మన్ ఆఫర్ ఇస్తే వద్దన్నడు : సీఎం రేవంత్ రెడ్డి

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు TSPSC ఛైర్మన్ ఆఫర్ ఇస్తే వద్దన్నడు  :  సీఎం రేవంత్ రెడ్డి

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరనున్నారనే వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరతారని తాను అనుకోవడం లేదన్నారు. ప్రవీణ్ కుమార్ పట్ల తనకు గౌరవం ఉందన్న సీఎం ఆయన  సర్వీసులో ఉంటే డీజీపీ అయ్యేవారని చెప్పారు. మొన్న కూడా తాను ఆయనకు TSPSC ఛైర్మన్ ఆఫర్ ఇచ్చానని .. కానీ ఆయన దానిని తిరస్కరించారన్నారు. సమాజానికి ఇంకా ఏదో చేయాలన్న తపనతో ప్రవీణ్ కుమార్ ఉన్నారని చెప్పారు సీఎం రేవంత్... ఇప్పుడు కేసీఆర్ తో చేరితే దానిపై ఆయనే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.  

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి  ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్‌‌కుమార్‌‌‌‌ మార్చి 16వ తేదీన రాజీనామా చేశారు.  బీఎస్పీకి రాజీనామా చేయడానికి ముందే కేసీఆర్‌‌‌‌కు ఆర్‌‌‌‌ఎస్పీ సమాచారం ఇచ్చారు. నందినగర్‌‌‌‌లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. కేసీఆర్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.   కార్యకర్తలు, అభిమానులతో చర్చించి తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ఆర్ఎస్పీ తెలిపారు. అయితే భవిష్యత్తులో కేసీఆర్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌తో కలిసి పని చేస్తానని కూడా చెప్పారు.

 దీంతో బీఆర్‌‌‌‌ఎస్‌‌లో ప్రవీణ్ చేరిక ఖాయమైందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. నీలం జెండాను వదిలేసిన ఆర్‌‌‌‌ఎస్పీ.. సోమవారం తెలంగాణ భవన్‌‌లో గులాబీ కండువా కప్పుకుంటారని వారు అంటున్నారు. నాగర్‌‌‌‌కర్నూల్‌‌ ఎంపీగా బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీ గుర్తుపైనే ఆర్ఎస్పీ పోటీ చేస్తారని పేర్కొంటున్నారు. ఆయనతో పాటు బీఎస్పీలో ఇన్నాళ్లు కీలకంగా వ్యవహరించిన మరికొందరు నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలిసింది.