సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు.. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు.. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.  తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని నిర్ణయించారు. 2009 డిసెంబర్ 12 నుంచి 2014 జూన్ 2 వరకు ఉద్యమకారులపై ఉన్న అన్ని కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. 

మరోవైపు.. ప్రగతి భవన్ పేరును మారుస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ గా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.