అవును గుంపు మేస్త్రీనే.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా : సీఎం రేవంత్ రెడ్డి

అవును గుంపు మేస్త్రీనే.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా :  సీఎం రేవంత్ రెడ్డి

నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన. నాకు రైతుల కష్టమేంటో తెలుసు. రుణమాఫీ గురించి తెలుసు. మాట ఇస్తే ఆషామాషీగా ఇవ్వను. అంచనాతో మాట్లాడుతా. కేసీఆర్ లెక్క నేను 80 వేల పుస్తకాలు చదివినా అని అబద్ధాలు చెప్పను. ఆయన లెక్క ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ నేను చదవలేదు. జలీల్‌ఖాన్ లెక్క బీకామ్‌లో ఫిజిక్స్‌ చదవలేదు. నేను బీఏ చదువుకున్నా. నాకు కామన్‌ సెన్స్ ఉంది. ప్రజల సాధకబాధకాలు తెలుసు. నేను సింపుల్ మ్యాన్. ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. 

నాకున్న పరిమితమైన అవగాహనకు తోడు బాగా అవగాహన ఉన్నవాళ్లందరినీ కూర్చోబెట్టుకుని పనిచేయాలనేది నా ఆలోచన. నేను గుంపు మేస్త్రీని అని ఇదివరకు కూడా చెప్పిన. పునాది తవ్వేటోన్ని, కట్టడం కట్టేటోన్ని, సిమెంట్ అందించేటోన్ని, రాడ్ బైండింగ్ చేసేటోన్ని, ఫాల్ సీలింగ్ చేసేటోన్ని అందర్నీ కూర్చోపెట్టుకుని పనిచేయించుకుంటా. ఇప్పుడు కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నా. గుంపు మేస్త్రీ అని నా మీద జోకులేస్తున్నరు. గుంపుమేస్త్రీ అంటే బార్లు నడిపేటోడు కాదు.. రాత్రంతా కూర్చుని మందు తాగేటోడు కాదు. గుంపు మేస్త్రీ అంటే ఒక మంచి వృత్తి, కష్టపడేతత్వం ఉన్న పని అని వీ6కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు .