V6 News

ఏప్రిల్ 20న మేడిగడ్డ కు సీఎం

 ఏప్రిల్  20న మేడిగడ్డ కు సీఎం
  •     కాటారం మండలం నస్తూర్‌‌పల్లిలో బహిరంగ సభ

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు : సీఎం రేవంత్‌‌రెడ్డి ఈ నెల 20న భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు. మేడిగడ్డ పునరుద్ధరణపై ఇటీవలే సమీక్ష చేపట్టిన సీఎం ప్రాజెక్ట్‌‌ సందర్శనకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు బుధవారం ధన్వాడలోని తన ఇంట్లో జిల్లా ఆఫీసర్లతో సమీక్ష చేపట్టారు. సీఎం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన అనంతరం వచ్చే నెల 21 నుంచి జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలపై ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. 

అనంతరం కాటారం మండలం నస్తూర్‌‌పల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. సీఎం టూర్‌‌ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌‌ రాహుల్‌‌ శర్మ, ఎస్పీ సంకీర్త్‌‌కు మంత్రి సూచించారు. రివ్యూ అనంతరం సభ ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సమీక్షలో ట్రేడ్ కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ అయిత ప్రకాశ్‌‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌ కోట రాజబాబు పాల్గొన్నారు.