కేరళకు సీఎం రేవంత్ .. అక్కడి నుంచి ఢిల్లీకి

కేరళకు సీఎం రేవంత్ ..   అక్కడి నుంచి ఢిల్లీకి

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేరళ వెళ్తున్నారు. కోజీకోడ్ లో ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణలో సీఎం పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారు. జూన్ 2న జరగబోయే తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఈ సారి జరిగే తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి, తెలంగాణ ప్రజల హృదయాల్లో సోనియమ్మగా తనదైన ముద్ర వేసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ ని ఘనంగా సత్కరించడంతోపాటు రాష్ట్రగీతాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.