
లక్నో: బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ.. లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలవడానికి ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలు ఆధారంగా నిలుస్తాయని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘అస్సీ బనేగా ఆధార్, ఎన్డీయే చార్ సౌ పార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ అని సోమవారం ఆయన లక్నోలో నినదించారు. నయా, శ్రేష్ఠ, ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ కోసం బీజేపీ సంకల్ప్ పత్రం బ్లూప్రింట్‌గా పనిచేస్తుందని పేర్కొన్నారు. అవినీతి నిర్మూలన, దేశాభివృద్ధికి పూర్తి నిబద్ధతతో కట్టుబడి పనిచేస్తామని చెప్పారు. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ సంకల్ప్ పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారని, దాని మొదటి నాలుగు పేజీలు దేశంలోని నాలుగు సామాజిక స్తంభాలను సూచిస్తున్నాయన్నారు.