చంద్రబాబు హయాంలో కరువు రాజ్యం ఏలింది: సీఎం జగన్ 

చంద్రబాబు హయాంలో కరువు రాజ్యం ఏలింది: సీఎం జగన్ 

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పేదలను, రైతులను పట్టించుకోలేదని విమర్శించారు ఏపీ సీఎం జగన్ . చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం రాష్ట్రంలో కరువు రాజ్యం ఏలిందన్నారు, వర్షాలు పడక, పంటలు పండక నానా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కర్నూలులో పర్యటించిన సీఎం రైతు భరోసా నిధులను విడుదల చేశారు.  మహానాడు పెద్ద డ్రామా అన్నారు.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసిన ఆయన .. వైసీపీ ప్రభుత్వం పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు.   

ఈ ఏడాది తొలివిడత వైఎస్సార్ రైతు భరోసా కింద 52 లక్షల 30 వేల 939 మంది రైతుల ఖాతాల్లో రూ.5,500 చొప్పున జమ చేశారు.  పీఎం కిసాన్ రూ.2000 ను నిధులు విడుదలైన వెంటనే అందిస్తామన్నారు. అలాగే అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన 47,999 మంది రైతుల ఖాతాల్లోకి రూ.44 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని జమ చేశారు. ఈ నాలుగేళ్ల కాలంలో రైతులందరికీ రూ.30,985 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.